ప్రతిపక్షనేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ అర్థంలేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రాహుల్ వ్యాఖ్యలు అర్ధరహితమని ఆమె పేర్కొన్నారు. దేశం గురించి రాహుల్ మాట్లాడిన మాటలు సరైనవి కాదని హితువు పలికిన కంగనా, కాంగ్రెస్ నేతలు వారి రాజకీయ లబ్ధి కోసం దేశాన్ని ముక్కలుగా విభజిస్తారని, వారి మనస్తత్వం అదేనని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలను కూడా ఆమె ప్రస్తావించారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ హయాం నుంచే ఇలానే జరుగుతుందన్నారు.
లోక్సభలో తాను చేసిన చక్రవ్యూహం ప్రసంగం కొందరికి నచ్చలేదని ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అందుకు ప్రతీకారంగా తనపై ఈడీ దాడులు జరిగే అవకాశముందని అనుమానం వ్యక్తం చేశారు.