వైద్య విద్యలో ప్రవేశానికి నిర్వహించిన నీట్ పరీక్షల్లో లోపాలపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరిపింది. నీట్ పరీక్షల్లో ఎలాంటి వ్యవస్థీకృత అక్రమాలు జరగలేదని, కేవలం ఝార్ఖండ్‌లోని హజారీబాగ్, బిహార్ రాజధాని పాట్నా ప్రాంతాల్లోనే పేపర్ లీకైందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. అయితే పరీక్షలు నిర్వహించిన సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ పనితీరును తప్పుపట్టింది.లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఇలాంటి పరీక్షలను చాలా జాగ్రత్తలు తీసుకుని నిర్వహించాలని ఆదేశించింది. నీట్ పరీక్షల నిర్వహణపై ఇస్రో మాజీ ఛైర్మన్ రాధాకృష్ణన్ అధ్యక్షత ఓ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. కమిటీని మరింత విస్తరించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రశూడ్ ఆదేశించారు.
నీట్ యూజీ 2024 పరీక్షల నిర్వహణలో లోపాలు ఫలితాల తరవాత వెలుగు చూశాయి. 67 మందికి మొదటి ర్యాంకు రావడం, ఒకే పరీక్షా కేంద్రంలో టెస్ట్ రాసిన 8 మంది అభ్యర్థులకు ఒకే ర్యాంకు రావడంతో లోపాలు బయటపడ్డాయి. దేశ వ్యాప్తంగా 4700పైగా కేంద్రాల్లో నీట్ పరీక్ష నిర్వహించారు. అయితే రెండు ప్రాంతాల్లోనే పరీక్షా పత్రాలు లీకయ్యాయని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇప్పటికే బిహార్‌లో 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఝార్ఖండ్‌లోనూ పరీక్షా పత్రాలు లీక్ చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు