ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్, మేనేజ్మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 4,455 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
బీవోబీ, బీవోఐ, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఐవోబీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల్లో ఖాళీలను భర్తీ చేస్తారు.
డిగ్రీ విద్యార్హతతో పాటు 20 నుంచి 30 ఏళ్ళ మధ్య వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమినరీ, మెయిన్ రాత పరీక్షలు, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఆన్లైన్లో అప్లై చేసేందుకు ఆగస్టు 21 వరకు గడువు ఉంది.ప్రభుత్వ బ్యాంకుల్లో 896 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన కూడా విడుదలైంది.