శ్రీశైలం దేవస్థానంలో ఉద్యోగి మందుతాగి భక్తులపై వీరంగం వేసిన ఘటన సంచలనంగా మారింది. క్యూ లైన్లలో నిలబడ్డ భక్తులను దుర్భాషలాడుతూ ఓ ఉద్యోగి వీరంగం వేయడంతో భక్తులు తిరగబడి చితకొట్టారు. అక్కడే ఉన్న ఆలయ అధికారి స్వాములు సర్థిచెప్పే ప్రయత్నం చేయగా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్వాములు అక్కడ నుంచి చిన్నగా జారుకున్నాడు.
భక్తులు పదుల సంఖ్యలో వెళ్లి ఆలయ ఈవో పెద్దిరాజుకు ఫిర్యాదు చేశారు. తాగుబోతు ఉద్యోగి వివరాలు అందించారు. అతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆలయ ఉద్యోగులే తాగి విధుల్లోకి వస్తుంటే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారని భక్తులు ప్రశ్నిస్తున్నారు.