భారత భద్రతా బలగాల చేతిలో పాకిస్తాన్ కు చెందిన పేరుమోసిన ఉగ్రవాది హతం అయ్యాడు. పాకిస్తాన్ ఎస్ఎస్జీ కమాండో, 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ కు సన్నిహితుడిగా పేరున్న నోమన్ జియావుల్లాను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో భారత భద్రతా దళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. జులై 27న మచిల్ ప్రాంత పరిధిలో భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించి చనిపోయాడు.
పాకిస్తాన్ లోని తుగలియాల్‌పూర్ పోస్ట్ నుంచి భారత భూభాగంలోకి జియావుల్లా ప్రవేశించాడని నిఘా ఏజెన్సీలు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా బలగాలు మంగుచెక్ ప్రాంతంలోని ఖోర్రా పోస్ట్ సమీపంలో అతడి కార్యకలాపాలను గుర్తించారు. భారత్‌లోకి చొరబడడమే కాకుండా చొరబాట్లను పర్యవేక్షిస్తున్నట్టు జమ్మూ ఫ్రాంటియర్ బీఎస్ఎఫ్ ఐజీ డీకే బురా ధ్రువీకరించారు.
భారీ ప్రణాళికతోనే జియావుల్లా భారత్‌లోకి ప్రవేశించాడనే అనుమానంతో బీఎస్ఎఫ్, స్థానిక అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. జియావుల్లా మృతదేహాన్ని పోలీసులకు అప్పగించారు. హఫీజ్ సయీద్‌తో జియావుల్లా సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు వెలుగులోకి వచ్చాయి.