మహేష్ కో ఆపరేటివ్ బ్యాంకు కుంభకోణంపై ఈడీ అధికారులు హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. వక్ఫ్ భూములు తాకట్టుపెట్టి రూ.300 కోట్ల రుణ కుంభకోణానికి పాల్పడ్డ ఆరోపణలపై బ్యాంకు ఛైర్మన్ రమేష్‌కుమార్ బంగ్ డైరెక్టర్లు ఛాంద్ అస్వ, పురుషోత్తమ్‌దాస్ మందాన ఇళ్లలో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. తప్పుడు పత్రాలు ద్వారా బ్యాంకు రుణాలు మంజూరు చేసి, 10 శాతం కమీషన్లు తీసుకున్నారనే ఆరోపణలపై ఈడీ సోదాలు చేస్తోంది. బ్యాంకు ఛైర్మన్ ఇంటి నుంచి కోటి నగదు, భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు.
బ్యాంకు ప్రధాన కార్యాలయం నిర్మాణంలో రూ.6 కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. సరైన పత్రాలు లేకుండా రుణాలు మంజూరు చేయడం, బ్యాంకులో బంగారం తాకట్టుపెట్టిన వారిని మెంబర్లుగా చూపించి పలు నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పెద్ద ఎత్తున తప్పుడు పత్రాలతో రుణాలు మంజూరు చేసి కమీషన్ల రూపంలో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారనే ప్రధాన ఆరోపణలపై ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.