స్టాక్ సూచీలు ఇవాళ సరికొత్త రికార్డును నెలకొల్పాయి. త్వరలో అమెరికా ఫెడ్ వడ్డీరేట్లు తగ్గించబోతోందంటూ వార్తలు రావడంతో కొనుగోళ్లకు మద్దతు లభించింది. సెన్సెక్స్ 126 పెరిగి 81867 పాయింట్ల వద్ద ముగిసింది. ఒక దశలో 82వేల పాయింట్లు దాటింది. చివరకు లాభాల స్వీకరణతో సెన్సెక్స్ దిగివచ్చింది. నిఫ్టీ 59 పెరిగి, 25010 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 25 వేల మార్కును దాటి రికార్డు నెలకొల్పింది.
ఎన్టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, పవర్‌గ్రిడ్, అదానీ పోర్ట్స్, నెస్లే ఇండియా లాభపడ్డాయి. టాటా స్టీల్, మహింద్రా అండ్ మహింద్రా, టాటా మోటార్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నష్టపోయాయి. ముడిచమురు ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. బ్యారెల్ ముడిచమురు 80 అమెరికా డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా పెరిగి ఔన్సు 2479 యూఎస్‌డీ వద్ద ట్రేడవుతోంది.