లోక్‌సభ ప్రజాపద్దుల కమిటీలో ముగ్గురు తెలుగు ఎంపీలకు చోటు దక్కింది. 15 మంది సభ్యులతో కమిటీ ఏర్పడింది. ప్రతిపక్షనేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. 15 మందిలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారికి అవకాశం లభించింది.కమిటీలో సభ్యత్వం కోసం 19 మంది ఎంపీలు పోటీపడినప్పటికీ చివరి నిమిషంలో నలుగురు సభ్యులు ఉపసంహరించుకోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది.
సభ్యులుగా… టీఆర్ బాలు, నిషికాంత్ దూబే, జగదాంబికా పాల్, రవిశంకర్ ప్రసాద్, సీఎం రమేష్, త్రివేంద్ర సింగ్ రావత్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సౌగతరాయ్, అపరాజితా సారంగి, అమర్ సింగ్, తేజస్వీ సూర్య, అనురాగ్ ఠాకూర్, వి.బాలశౌరి, కేసి వేణుగోపాల్, ధర్మేంద్ర యాదవ్ ఎన్నికయ్యారు.
2025 ఏప్రిల్ 30తో ఈ కమిటీ సభ్యుల కాలపరిమితి ముగియనుంది. ఆ తర్వాత మరోసారి ఎన్నిక జరగనుంది.
కమిటీలో ఏపీకి చెందిన ఎంపీలకు మొదటిసారిగా అవకాశం లభించింది. ముగ్గురు కూడా మూడు పార్టీల నుంచి గెలిచిన వారే కావడం మరో విశేషం. టీడీపీకి చెందిన ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జనసేన నుంచి మచిలిపట్నం పార్లమెంట్ సభ్యుడు బాలశౌరి, బీజేపీకు చెందిన అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేశ్ లు బీఏసీలో సభ్యులుగా ఎన్నికయ్యారు.
స్పీకర్ ఆదేశాల మేరకు లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులకు ఈనెల 9, 10 తేదీల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు.