పారిస్ వేదికగా జరుగుతోన్న ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు మరో పతకం సాధించారు. యువ షూటర్ స్వప్నిల్ కుసాలీ మెన్స్ 3 పొజిషన్ షూటింగ్లో మూడో స్థానంలో నిలిచాడు. దీంతో స్వప్నిల్‌కు కాంస్య పతకం దక్కింది. ఇప్పటికే మహిళల విభాగంలో మనూ బాకర్, మిక్స్డ్ విభాగంలో మనూ, సరబ్జీత్ సింగ్ జోడీ కాంస్యం సొంతం చేసుకున్నారు. ఇవాళ స్వప్నిల్ షూటింగ్లో మూడో కాంస్యం దక్కించుకున్నారు. ఇప్పటి వరకు భారత్‌కు వచ్చిన మూడు పతకాలు షూటింగ్, అందులోనూ కాంస్యం కావడం విశేషం.
పతకాల పట్టికలో చైనా మొదటి స్థానంలో నిలిచింది. తరవాత ఫ్రాన్స్, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు నిలిచాయి. చైనాకు 10 బంగారు పతకాలు సహా మొత్తం 20 పతకాలు దక్కాయి. ఫ్రాన్స్ 8, జపాన్ ఆటగాళ్లు 8 బంగారు పతకాలు చొప్పున గెలుచుకున్నారు.
ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు రాణా అయ్యూబ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు