ఢిల్లీలో అతి భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. గంటలోనే 11సెం.మీ వర్షపాతం నమోదు కావడంతో రోడ్లు నదులను తలపించాయి. కుండపోతతో ముంచెత్తిన వరద నీటిలో మునిగి ఐదుగురు చనిపోయారు. వేలాది ఇళ్లు నీటిలో మునిగాయి. రోడ్లపై కిలోమీటర్ల మీర వాహనాలు నిలిచిపోయాయి. నొయిడా ఢిల్లీ జాతీయ రహదారిపై కూడా కిలోమీటర్లమేర వాహనాలు నిలిచిపోయాయి. అత్యవసరం అయితే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరించినా జనం వినలేదు. పది విమానాలు దారిమళ్లించారు. అన్ని విమానాలు సమాయానికి నడుస్తున్నా…విమానాశ్రయానికి చేరుకునేందుకు ప్రయాణీకులు నానాపాట్లుపడుతున్నారు.
ఇవాళ ఢిల్లీలో బడులకు సెలవు ప్రకటించారు. మరోసారి కుండపోత వర్షాలు పడతాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అత్యవసరం అయితేనే బయటకు రావాలని, ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆప్ మంత్రి అతిషి పిలుపునిచ్చారు.