హైదరాబాద్‌లో మరో అరాచకం వెలుగు చూసింది. సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తానంటూ హైదరాబాద్ పుప్పాలగూడలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోన్న యువతిని షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ సిద్ధార్థ్ అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. బాధిత యువత కథనం ప్రకారం…
స్నేహితురాలి ద్వారా సిద్ధార్థ్ పరిచయమయ్యాడు. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటూ బుధవారంనాడు గచ్చిబౌలితో తన ఇంటికి భోజనానికి పిలిచాడు. కూల్ డ్రింకులో మత్తుమందు కలిపి ఇచ్చాడని బాధిత యువతి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మత్తుమందు ఇచ్చాక పలుమార్లు సిద్ధార్థ్ తనపై లైంగిక దాడి చేశాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం పోలీసులు వేట మొదలెట్టారు.