పశ్చిమాసియా మరోసారి భగ్గుమనే సూచనలు కనిపిస్తున్నాయి. హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియాను ఇరాన్లో హతం చేసిన తరవాత ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. హనియాను ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టడంతో ప్రతిదాడికి సిద్దం కావాలంటూ ఇరాన్ అగ్రనేత అయతుల్లా అలీ ఖమేనీ పిలుపునిచ్చినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. బుధవారం నాడు ఇరాన్ అగ్రనేత అయనుల్లా జాతీయ భద్రతా మండలి సమావేశంలో కీలక ఆదేశాలు జారీ చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనాలు ప్రచురించింది. దీనిపై ఇరాన్ అధికారికంగా స్పందించలేదు.
హమాస్ అగ్రనేతను ఇరాన్లో మట్టుబెట్టడం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు ఆజ్యం పోశాయి. తమ దేశంపై దాడి చేయడాన్ని ఇరాన్ సీరియస్‌గా తీసుకుంది. ఇజ్రాయెల్‌పై ఏ క్షణంలోనైనా దాడులతో విరుచుకుపడవచ్చనే సమాచారం అందుతోంది. పాలస్తీనా, ఇజ్రాయెల్ యుద్ధం మరిన్ని దేశాలకు వ్యాపించే ప్రమాదముందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.