భారత మాజీ క్రికెటర్ అన్షుమాన్ గైక్వాడ్ తుదిశ్వాస విడిచారు. బ్లడ్ కేన్సర్‌తో చాలాకాలంగా బాధపడుతున్న గైక్వాడ్ 71 ఏళ్ళ వయసులో బుధవారం రాత్రి కన్నుమూశారు. గైక్వాడ్ స్వస్థలం ముంబై కాగా ఆయన లండన్‌లోని కింగ్స్ కాలేజ్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుని ఇటీవలే స్వదేశానికి వచ్చారు.
గైక్వాడ్ భారత్ తరఫున 55 అంతర్జాతీయ మ్యాచ్‌లు, బరోడా తరఫున 250కి పైగా దేశవాళీ మ్యాచ్‌లు ఆడారు. 1987లో రిటైర్ అయ్యారు. 1997 -2000 మధ్యకాలంలో జాతీయ జట్టు సెలెక్టర్‌గా వ్యవహరించిన గైక్వాడ్, ఆ తర్వాత ప్రధాన జట్టుకు హెడ్ కోచ్‌గానూ సేవలు అందించారు.
అన్షుమాన్ గైక్వాడ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. గైక్వాడ్ ప్రతిభగల ఆటగాడని, అత్యుత్తమ కోచ్ అని సంతాప సందేశంలో పేర్కొన్నారు.
గైక్వాడ్ వైద్య ఖర్చుల సాయం అందస్తామని బీసీసీఐ బోర్డు కార్యదర్శి జై షా గత నెలలో తెలిపారు. మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సూచన తో జైషా ఈ ప్రకటన చేశారు.