కుండపోత వర్షాలకు హిమాచల్‌ప్రదేశ్‌లో వరదలు ముంచెత్తాయి. బుధవారం రాత్రి సిమ్లా జిల్లా రాంపూర్ వద్ద కురిసిన కుంభవృష్టికి ఏర్పడ్డ వరదలో 30 మంది గల్లంతయ్యారు. రెండు వారాలుగా హిమాచల్‌ను భారీ వర్షాలు వెంటాడుతున్నాయి. జులైలో సంభవించిన వరద విలయం నుంచి బయటపడక ముందే మరోసారి సిమ్లా జిల్లాను వరదలు ముంచెత్తాయి. బాధితులను ఆదుకునేందుకు పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపినట్లు సిమ్లా డిప్యూటీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కశ్యప్ తెలిపారు.
రెండు నెలల్లో నాలుగుసార్లు హిమాచల్‌ప్రదేశ్ వరదల భారినపడింది. వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. జూన్, జులై మాసాల్లో మొదలైన వరదలు ఇంకా కొనసాగుతున్నాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పర్యాటకరంగానికి కోలుకోలేని దెబ్బతగిలింది. తాజాగా మరోసారి వరదలు ముంచెత్తడంతో 20 మంది గల్లంతయ్యారు. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వం సహాయక చర్యలను పెద్ద ఎత్తున ప్రారంభించింది.