వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ పై యూపీఎస్సీ చర్యలు తీసుకుంది. ఆమె నియామకాన్ని రద్దు చేసింది. భవిష్యత్తులో ఆమె సివిల్స్ పరీక్షలో పాల్గొనకుండా జీవితకాల నిషేధం విధించింది. ఫూజా ఖేద్కర్ పూణే ప్రొబేషనరీ సబ్ కలెక్టర్ గా పనిచేసిన సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. సెలెక్షన్ సమయంలో యూపీఎస్సీకి తప్పుడు పత్రాలు సమర్పించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
పూజా ఖేద్కర్ పై వచ్చిన ఆరోపణలపై ఇటీవలే కేంద్రం నియమించిన ఏకసభ్య కమిటీ ఇటీవలే డీఓపీటీకి నివేదిక సమర్పించింది. మహారాష్ట్రకు చెందిన వైభవ్ కోకట్ చేసిన ట్వీట్ తో పూజా ఖేద్కర్ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఖరీదైన ఆడి కారుతో పాటు పూజా ఖేద్కర్ ఫొటోను వైభవ్ కోకట్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దాంతో ఆమె చట్టవ్యతిరేక చర్యలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు