పారిస్ ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు.చివరి లీగ్ మ్యాచ్‌లో 21-18, 21-12 తేడాతో ప్రపంచ నాలుగో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)పై నెగ్గాడు. తొలి గేమ్‌లో ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నప్పటికీ లక్ష్యసేన్ విజయం సాధించాడు. దీంతో గ్రూప్-ఎల్ నుంచి ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించాడు.
మహిళల సింగిల్స్ టెబుల్ టెన్నిస్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి ఆకుల శ్రీజ రౌండ్ 16లోకి అడుగుపెట్టింది. సింగపూర్‌కు చెందిన క్రీడాకారిణి జియాన్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీజ 4 – 2 తేడాతో విజయం సాధించింది. దీంతో ఒలింపిక్స్ రౌండ్ 16లోకి ప్రవేశించిన రెండో భారత క్రీడాకారిణిగా శ్రీజ రికార్డు సృష్టించింది.
మరో భారత షూటర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్‌లో స్వప్నిల్ కుసాలే చివరి రౌండ్‌కు అర్హత సాధించాడు. షూటింగ్‌లో ఫైనల్ చేరిన ఐదో భారత షూటర్‌గా స్వప్నిల్ గుర్తింపు సాధించాడు.నేడు జరిగిన పురుషుల పోటీల్లో స్వప్నిల్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. నీలింగ్ రౌండ్‌లో 198 పాయింట్లు, ప్రొన్ రౌండ్‌లో 197 పాయింట్లు సాధించి 7వ స్థానంలో నిలిచాడు. ఆగస్టు 1 గురువారం నాడు ఫైనల్ రౌండ్ జరుగనుంది.