భారీ వర్షాల నేపథ్యంలో కొండచరియలు విరిగిపడే అవకాశముందని కేరళ ప్రభుత్వాన్ని తాము ముందే హెచ్చరించామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ముప్పును అంచనా వేసి జులై 23నే కేంద్రప్రభుత్వం అప్రమత్తం చేసిందన్నారు. కానీ కేరళ రాష్ట్ర ప్రభుత్వం పౌరులను సకాలంలో సురక్షిత ప్రాంతాలకు తరలించలేదని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కేరళకు పంపించామని వివరించారు.
వాయనాడ్ లో కొండచరియలు విరిగిన ఘటనలో మృతుల సంఖ్య 180కి చేరింది. సహాయక చర్యల్లో ఆర్మీ పోర్టబుల్ బ్రిడ్జిలను వినియోగిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఈ తరహా వంతెనలు ఉపయోగించారు. ఈ బ్రిడ్జిలను హెలికాప్టర్ల సహాయంతో తరలించ్చవచ్చు. దిల్లీ నుంచి 110 అడుగుల బ్రిడ్జిని తీసుకువచ్చి సహాయ చర్యల్లో వినియోగిస్తున్నారు. మరో 170 అడుగుల వంతెనను తయారు చేయాలని ఆర్మీ యోచిస్తోంది.