భారతదేశపు ప్రముఖ షట్లర్ పివి సింధు పారిస్ ఒలింపిక్స్‌లో గ్రూప్ స్టేజ్‌లో రెండో మ్యాచ్‌లో అలవోక విజయం సాధించింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో ప్రీ-క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది.
గ్రూప్-ఎం లో ఆఖరి మ్యాచ్‌లో పీవీ సింధు ఎస్తోనియా క్రీడాకారిణి క్రిస్టీన్ కూబాతో తలపడింది. మ్యాచ్ ప్రారంభం నుంచీ సింధు స్పష్టమైన ఆధిక్యం చూపించింది. రెండో సెట్‌లో క్రిస్టీన్ కొంచెం పుంజుకున్నా, సింధు ఫామ్‌ను ఎంతమాత్రం అందుకోలేకపోయింది. కేవలం 34 నిమిషాల్లో ముగిసిపోయిన ఈ మ్యాచ్‌లో సింధు 21-5, 21-10 స్కోర్‌తో వరుసగా రెండు సెట్లలోనూ గెలిచింది.
సింధు తర్వాత ఆడబోయే రౌండ్ ఆఫ్ సిక్స్‌టీన్ మ్యాచ్‌లో చైనా క్రీడాకారిణి హె బింగియావోతో తలపడే అవకాశం ఉంది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో సింధు, బింగియావోను ఓడించి కాంస్యపతకం సాధించింది.
ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు రాణా అయ్యూబ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు