దిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న ఆమె రిమాండ్ ను దిల్లీలోని రౌస్ అవెన్యూస్ కోర్టు మరోసారి పొడిగించింది.
ఈ స్కామ్ విచారణలో భాగంగా మార్చి 16న కవిత అరెస్టయ్యారు. బెయిల్ కోసం కవిత పలుమార్లు ప్రయత్నించినప్పటికీ న్యాయస్థానం తిరస్కరించింది. నేటితో కవిత జ్యుడీషియల్ రిమాండ్ గడువు ముగియనుండటంతో అధికారులు ఆమెను వర్చువల్‌గా కోర్టులో హాజరుపరిచారు. కేసు విచారణ కీలక దశలో ఉన్నందున కవిత రిమాండ్‌ను పొడిగించాలని ఈడీ అధికారులు న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈడీ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను ఆగస్టు 13 వరకు పొడిగించింది.