కేరళలోని వయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 143కి చేరింది. మరో 128 మంది గాయపడి పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. కుండపోత వర్షాల కారణంగా భారీగా కొండచరియలు విరిగిపడుతున్నాయి.
సంఘటనా ప్రాంతాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. బాధితులు సహాయ చర్యల కోసం ఎదురు చూస్తూ రోదిస్తున్నారు. తీవ్రంగా గాయపడి కొందరు, రక్త సంబంధీకుల మృతితో మరికొందరు విలపిస్తున్నారు. అప్పటి వరకు తమతో కలిసి ఉన్న తోటి వారి జాడ దొరకకపోవడంతో తల్లడిల్లిపోతున్నారు. ముండక్కై, చూరల్మల, అట్టామల, నూల్పుజా గ్రామాల్లో పరిస్థితి చూసిన వారు చలించిపోతున్నారు.
మంగళవారం తెల్లవారుజామున రెండుగంటల సమయంలో మొదటిసారి కొండచరియలు విరిగిపడగా మళ్లీ 4గంటల10 నిమిషాల సమయంలో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి.
ఆస్తులన్నీ కాజేసిన అన్నగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు : షర్మిల