ఉత్తరప్రదేశ్‌లో ఆర్ఎస్ఎస్ శాఖలపై దాడులు చేయడాన్ని ముస్లిములు పనిగా పెట్టుకున్నారు. తాజాగా అటువంటి సంఘటన లఖ్‌నవూలోని చిన్‌హట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జులై 27న చోటు చేసుకుంది. స్వయంసేవకులు శాఖ నిర్వహించుకుంటుండగా స్థానిక ముస్లిం యువకులు రాళ్ళదాడికి పాల్పడ్డారు.
శాఖ కార్యవాహ యువరాజ్ ప్రజాపతి చిన్‌హట్ పీఎస్‌లో ఫిర్యాదు చేసారు. సాకిబ్ అనే వ్యక్తితో పాటు సుమారు 10మంది గుర్తుతెలియని ముస్లిం యువకులు దాడికి పాల్పడ్డారని ఆయన ఆ ఫిర్యాదులో ప్రస్తావించారు.
చిన్‌హట్‌లోని చాహరియా మాత ఆలయం ఆవరణలో ప్రతీరోజూ సాయంత్రం సంఘ శాఖ నిర్వహిస్తుంటారు. జులై 27 సాయంత్రం 6గంటల సమయంలో అలాగే శాఖ జరుగుతోంది. ఆ సమయంలో ముస్లిం దుండగులు రాళ్ళు, ఇటుకలు తెచ్చుకుని వాటితో శాఖలో పాల్గొన్న స్వయంసేవకులపై దాడి చేసారు. ఆ ప్రాంతంలో ఇకపై శాఖ పెట్టకూడదనీ, అదే జరిగితే చంపేస్తామనీ బెదిరించారు.
ఆ వివరాలతో యువరాజ్ ప్రజాపతి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. భారతీయ న్యాయ సంహిత 2023 సెక్షన్లు 191(2), 352, 232 ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేశవప్రసాద్ మౌర్య ఆ సంఘటనపై స్పందించారు. ‘‘ఆర్ఎస్ఎస్ శాఖపై దాడి సంఘటనలో సమగ్ర దర్యాప్తు జరుగుతుంది. కఠిన చర్యలు తీసుకుంటాము’’ అని చెప్పారు.
జూన్ 23న ఇటువంటిదే ఒక సంఘటన రాజస్థాన్‌లోని భిల్వాడాలో చోటు చేసుకుంది. నగరంలోని మహాత్మాగాంధీ హాస్పిటల్ కాంప్లెక్స్ చేరువలోని పార్క్‌లో సంఘ శాఖ జరుగుతుండగా ముస్లిములు రాళ్ళదాడి చేసారు. ఆ ఘటనలో ఒక బాలుడు, ఒక యువకుడు గాయపడ్డారు. వారిద్దరూ రెండురోజుల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది.
భిల్వాడాలో గాంధీ పార్క్ ప్రాంతంలో 40శాతం మంది ముస్లిములు ఉన్నారు. దాంతో వారు సంఘ శాఖపై క్రమం తప్పకుండా దాడులు చేస్తున్నారు. శాఖలో ఐదుగురికి మించి పాల్గొంటే చాలు, రాళ్ళు రువ్వుతున్నారు. అయినప్పటికీ ప్రతీరోజూ కనీసం 15మందికి తగ్గకుండా శాఖలో పాల్గొంటున్నారు.