హైదరాబాద్లో దారుణం జరిగింది. నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లా పామర్రు వెళుతోన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ఓ మహిళపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు పోలీసులకు ఫోన్ చేయడంతో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. బస్సు హైదరాబాద్ చేరిన సమయంలో మహిళ నోట్లో గుడ్డలు కుక్కి డ్రైవర్ అత్యాచారం చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ద్వారా తెలుస్తోంది.
ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు తెలంగాణలోని నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లా పామర్రుకు వస్తున్న క్రమంలో హైదరాబాద్లో ఈ దారుణానికి డ్రైవర్ ఒడిగట్టాడని పోలీసులు చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అత్యాచారం జరిగిన సమయంలో బస్సులో 36 మంది ప్రయాణీకులు ఉన్నారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.