ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి భేటీ ఆగస్టు 2న జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాక్‌లో ఉదయం 11 గంటకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.
సమావేశంలో చర్చించాల్సిన అంశాలను, ప్రతిపాదనలు నిర్దేశిత విధానంలో ఆయా శాఖల అధికారులు బుధవారం సాయంత్రంలోగా సాధారణ పరిపాలన శాఖకు అందజేయాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులకు ఏపీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.
ఆగస్టు 5న కలెక్టర్ల సమావేశం నిర్వహించనున్నట్లు నీరబ్ కుమార్ ప్రసాద్ వివరించారు. మంత్రులు, ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొంటారన్నారు.