కేరళలో కొండ చరియలు విరిగిపడిన దుర్ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వయనాడ్ జిల్లా మెప్పాడి సమీపంలో సోమవారం రాత్రి రెండు సార్లు కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 400 భవనాలు కనిపించకుండా పోయాయని స్థానిక మీడియా ద్వారా తెలుస్తోంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 93 మృతదేహాలను వెలికితీశారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదముందని కేరళ రెవెన్యూ మంత్రి కె.రాజన్ తెలిపారు.
కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో సహాయచర్యలు చురుగ్గా సాగుతున్నాయి. పెద్ద ఎత్తున మట్టి పేరుకుపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. బురదలో కూరుకుపోయిన కొందరి నుంచి, రక్షించాలంటూ ఇప్పటికీ అనేక ఫోన్ కాల్స్ వస్తున్నాయని పోలీసులు తెలిపారు.
కొండచరియలు విరిగిపడిన ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు. హెలికాఫ్టర్ల ద్వారా గాయపడ్డ 116 మందిని సమీపంలోకి ఆసుపత్రులకు తరలించారు. ఇంకా చాలా మంది ఆచూకీ తెలియడం లేదని స్థానికులు చెబుతున్నారు. మృతులు వందల సంఖ్యలో ఉండొచ్చనే భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు