ఎన్డీయే పాలన కారణంగా త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నామని ప్రధాని మోదీ తెలిపారు. 2014కు ముందు అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆర్ధిక వ్యవస్ధ మెరుగ్గా ఉందని చూపేందుకు బడ్జెట్లో భారీ ప్రకటనలు గుప్పించేదని ఎద్దేవా చేశారు. క్షేత్రస్ధాయిలో వాటి అమలును పట్టించుకోలేదని దుయ్యబట్టారు.
వికసిత్ భారత్ దిశగా ప్రస్థానం, కేంద్రబడ్జెట్ 2024-25పై సీఐఐ నిర్వహించిన సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ప్రారంభోపన్యాసం చేశారు. గత పదేళ్ళ తమ పాలనతో భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతమైందన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంతో పోలిస్తే తాము రైల్వే బడ్జెట్ను 8 రెట్లు, హైవేల బడ్జెట్ను 8 రెట్లు, వ్యవసాయ బడ్జెట్ను 4 రెట్లు పెంచామన్నారు. రక్షణ బడ్జెట్ను రెట్టింపు చేశామని వివరించారు.
శ్వేతపత్రం రూపంలో దేశ ఆర్ధిక వ్యవస్ధ ముఖచిత్రాన్ని దేశ ప్రజల ముందుంచామన్న ప్రధాని మోదీ, మనం ఎక్కడ ఉన్నామనేదానిపై చర్చ జరగాలని ఆకాంక్షించారు. పరిశ్రమల రంగాన్ని నూతన శిఖరాలకు చేర్చామన్నారు.
2004లో యూపీఏ తొలి బడ్జెట్లో మూలధన వ్యయం కేవలం రూ. 90,000 కోట్లు అయితే ఇప్పుడు తమ ప్రభుత్వం రూ. 11 లక్షల కోట్లు పైగా ఖర్చు చేస్తుందన్నారు. వికసిత్ భారత్ దిశగా పయనిస్తున్నామని, ఈ మార్పు కేవలం సెంటిమెంట్లతో రాలేదన్నారు. ఆత్మవిశ్వాసంతోనే సాధ్యమైందన్నారు.
ఆస్తులన్నీ కాజేసిన అన్నగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు : షర్మిల