హైదరాబాద్‌లో అరాచకం వెలుగు చూసింది. కొందరు యువకులు హైదరాబాద్ వనస్థలిపురంలోని ఓ హోటళ్లో సాఫ్ట్వేర్ ఇంజనీరుపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. పార్టీకి పిలిచిన కొందరు యువకులు మహిళపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఓ యువతిని మభ్యపెట్టి హోటల్‌కు రప్పించిన యువకులు, ముందస్తు ప్రణాళిక ప్రకారం లైంగిక దాడికి దిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. యువతికి మత్తు మందు ఇచ్చి లైంగిక దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. వైద్యపరీక్షల కోసం యువతిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితులు పరారయ్యారని తెలుస్తోంది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. యువతిని హోటల్‌కు తీసుకువచ్చిన వారి వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు.