ముంబై హవ్డా ఎక్స్‌ప్రెస్ ఝార్ఖండ్‌లోని చక్రధరపూర్ వద్ద పట్టాలు తప్పింది. ముంబై నుంచి హవ్డా వెలుతోన్న రైలు సోమవారం రాత్రి చక్రధరపూర్ వద్ద పట్టాలు తప్పింది. 18 బోగీలు పట్టాలపై నుంచి పక్కకు పడిపోయాయి. ముందుగా గూడ్సు రైలును ముంబై హవ్డా ఎక్స్‌ప్రెస్ వెనుక నుంచి ఢీ కొట్టిందని భావించారు. అయితే సమీపంలోనే గూడ్సు రైలు కూడా పట్టాలు తప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. ముంబై హవ్డా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో ఇద్దరు ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు.
రైలు ప్రమాద ఘటన విషయం తెలియగానే కేంద్ర రైల్వే మంత్రి అధికారులను హుటాహుటన సహాయక చర్యలకు ఆదేశించారు. పట్టాలు తప్పిన బోగీలను పక్కకు తప్పించారు. ఈ మార్గంలో పదుల సంఖ్యలో రైళ్లు రద్దు చేశారు. తరచూ రైలు ప్రమాదాలపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు.