కర్ణాటకలో కిలేడి వరుస వివాహాల వ్యవహారంపై హైకోర్టు జడ్జి సీరియస్ అయ్యారు. కర్ణాటకకు చెందిన ఓ యువతి ధనవంతులే లక్ష్యంగా వివాహం చేసుకోవడం, ఆరు నెలలకే భర్త, అత్తమామలపై గృహహింస కేసులు పెట్టి బెదిరించిన వ్యవహారం వెలుగు చూసింది. ఇలా ఏడు వివాహాలు చేసుకున్న మహిళ, తాజాగా విడాకుల కోసం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. కేసు విచారించిన జడ్జి మహిళ విడాకుల వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధనవంతులను లక్ష్యంగా చేసుకుని వివాహం చేసుకోవడం, ఆరు నెలలు కాగానే భర్త, అత్తమామలపై గృహ హింస కేసులు పెట్టి, పెద్దమొత్తంలో వారి నుంచి డబ్బు గుంజడం చేస్తోందని రికార్డుల ద్వారా తెలుస్తోంది. ఆరేళ్లలో ఏడోసారి విడాకులకు కోర్టుకు రావడంపై జడ్జి సీరియస్ అయ్యారు. తరచూ విడాకులు తీసుకోవడం చూస్తుంటే తప్పు, నీ వద్దే ఉన్నట్టు ఉందని జడ్జి వ్యాఖ్యానించారు. తదుపరి కేసును వచ్చే నెల 21కి వాయిదా వేశారు.