మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్దం కేసులో ఇద్దరు రెవెన్యూ అధికారులపై వేటు పడింది. అగ్నిప్రమాదం జరిగిన జూన్ 21 వరకు మదనపల్లె ఆర్డోవోగా చేసిన హరిప్రసాద్, అంతకు ముందు పనిచేసిన మురళి సహా సీనియర్ రికార్డు అసిస్టెంట్ గౌతమ్‌తేజ్‌ను సస్పెండ్ చేస్తూ రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి సిసోడియా ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని ఆదేశించారు.
ఈ నెల 21 రాత్రి మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం తగలబడింది. భూ రికార్డులు తారుమారు చేసి, వేలాది ఎకరాల అసైన్డు భూములు బినామీలకు బదలాయించారనే ఆరోపణలు బయటపడకుండా కొందరు కావాలనే కార్యాలయానికి నిప్పు పెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. జూన్ 20న ఆర్డీవో హరిప్రసాద్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం జాయింట్ కలెక్టర్‌గా మేఘస్వరూప్‌ను నియమించింది. మేఘస్వరూప్ బాధ్యతలు స్వీకరించేలోగానే రికార్డులు భద్రపరిచిన గది తగలబడింది. దీనిపై ప్రభుత్వం సిట్ వేసింది. ఇప్పటికే అనుమానితులను విచారించారు. కేసు పురోగతిలో ఉంది.