కేరళలో ప్రకృతి ప్రకోపించింది. కొండచరియలు విరిగిపడి 19 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గల్లంతయ్యారు. కేరళ మీడియా కథనాల ప్రకారం వయనాడ్ జిల్లా మెప్పాడి సమీపంలో కొండచరియలు విరిగిపడి 19 మంది మరణించారు. వందలాది మంది గల్లంతయ్యారని అనుమానిస్తున్నారు. మెప్పాడి ముండకై ప్రాంతంలో
వందలాది ఇళ్లు కనిపించకుండాపోయాయని తెలుస్తోంది. చురల్మల పట్టణంలో వందలాది భవనాలు తుడిచిపెట్టుకుపోయినట్లు స్థానిక మీడియా ద్వారా తెలుస్తోంది.
సోమవారం రాత్రి రెండు సార్లు కొండచరియలు విరిగిపడ్డాయని కేరళ రెవెన్యూ మంత్రి కె.రాజన్ వెల్లడించారు. సహాయక చర్యలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే ఐదు మృతదేహాలను వెలికితీశారు. గాయపడ్డ 15 మందిని హెలికాఫ్టర్ ద్వారా ఆసుపత్రులకు తరలించారు. సహాయక చర్యలను ముఖ్యమంత్రి పినరయి విజయన్ పర్యవేక్షిస్తున్నారు.