కృష్ణమ్మ వరదతో శ్రీశైలం ప్రాజెక్టు నిండింది. రెండు రాష్ట్రాల తాగు, సాగునీటి అవసరాలు తీరుస్తోన్న శ్రీశైలం ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తడం ద్వారా 80 వేల క్యూసెక్కులు నాగార్జునసాగర్ డ్యాంకు వదులుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 62 వేల క్యూసెక్కుల వరద నాగార్జునసాగర్ చేరుతోంది. శ్రీశైలం ఎగువ ప్రాంతంలోని పోతిరెడ్డిపాడుకు 18 వేల క్యూసెక్కులు బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు 6 వేల క్యూసెక్కుల జలాలు వాడుతున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 216 టీఎంసీలు కాగా, ప్రస్తుతం డ్యాంలో 190 టీఎంసీల నీరు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి 4 లక్షల 62 వేల క్యూసెక్కుల వరద వస్తూ ఉండటంతో ముందు జాగ్రత్తగా గేట్లు ఎత్తివేశారు. రాబోయే వారం రోజుల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కూడా పూర్తి స్థాయిలో నీరు చేరుతుందని ఇంజనీర్లు చెబుతున్నారు. ప్రస్తుతం సాగర్లో 512 అడుగుల నీరుంది. ఇది 135 టీఎంసీలకు సమానం. సాగర్ నుంచి తాగునీటి అవసరాలకు 5 వేల క్యూసెక్కులు విడుదల చేశారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు