బిహార్ సీఎం నితీష్ కుమార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తిగిలింది. గత నవంబరులో బిహార్‌లో బీసీ, ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లను 50 నుంచి 65 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నారు. దీనిపై కొందరు పట్నా హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన పట్నా హైకోర్టు నితీష్ కుమార్ ప్రభుత్వం కల్పించిన రిజర్వేన్లను రద్దు చేసింది. దీనిపై బిహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
బిహార్ ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లను కొట్టివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది.రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి వీల్లేదని గతంలోనే సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. కులగణన చేపట్టిన బిహార్ ప్రభుత్వం రిజర్వేషన్లను 50 నుంచి 65 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై పట్నా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది.