శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టి-20 సీరీస్‌ను భారత్ గెలుచుకుంది. ఇప్పటికే మొదటి మ్యాచ్‌లో గెలిచిన భారత్, ఆదివారం పల్లెకెలెలో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించి, సీరీస్ కైవసం చేసుకుంది. కొత్త కోచ్, కొత్త కెప్టెన్‌లతో ఆడిన మొదటి సీరీస్ ఇది.
తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. ఆతిథ్య లంక జట్టులో అత్యథికంగా కుశల్ పెరీరా 53పరుగులు చేసాడు. తర్వాత భారత్ బ్యాటింగ్ ప్రారంభించగానే వర్షం పడడంతో గంట పాటు ఆటకు అంతరాయం కలిగింది. దాంతో భారత్ లక్ష్యాన్ని 8 ఓవర్లలో 78 పరుగులకు కుదించారు. భారత జట్టు కేవలం 3 వికెట్లు కోల్పోయి 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. యశస్వి జైస్వాల్ 30 పరుగులు, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 26 పరుగులు, హార్దిక్ పాండ్యా 22 పరుగులతో మ్యాచ్‌ను ముగించేసారు.
భారత బౌలింగ్‌లో 26 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసిన రవి బిష్ణోయి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. సీరీస్‌లో ఆఖరి టి-20 మ్యాచ్ మంగళవారం జరుగుతుంది. ఆ మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా సీరీస్ ఇప్పటికే భారత్ కైవసం అయింది. సీరీస్ వైట్‌వాష్ కోసం భారత్ ప్రయత్నిస్తుంటే, ఒక్క మ్యాచ్ అయినా గెలిచి అవమాన భారం తప్పించుకోడానికి శ్రీలంక కష్టపడనుంది.