మాల్దీవులు భారత్‌కు చెల్లించాల్సిన రుణాలను సులభతరం చేయడంపై ఆ దేశ అధ్యక్షుడు ముయిజ్జు ధన్యవాదాలు తెలిపారు.మాల్దీవులకు భారత్ పెద్ద ఎత్తున రుణాలు అందించింది. ప్రస్తుతం మాల్దీవులు చెల్లింపుల సంక్షోభం దిశగా ఉందని ఐఎంఎఫ్ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి తీసుకున్న రుణాల తిరిగి చెల్లింపుల్లో వెలుసుబాటు కల్పించింది. దీనిపై మాల్దీవుల అధ్యక్షుడు మొయిజ్జు ధన్యవాదాలు తెలిపారు. భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్యంపై చర్యలు జరుపుతున్నట్లు తెలిపారు.
మాల్దీవులు డాలర్ సంక్షోభం ఎదుర్కొంటోంది. భారత్ మాల్దీవుల మధ్య రూపాయల్లో చెల్లింపులు జరిగేలా ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే స్వేచ్ఛా వాణిజ్యంపై బ్రిటన్‌తో మాల్దీవులు సంప్రదింపులు జరుపుతోంది.
మాల్దీవుల అధ్యక్షుడిగా మొయిజ్జు అధికారంలోకి వచ్చిన తరవాత చైనా అనుకూల విధానాలు అవలంభించడం, భారత్‌పై విమర్శలు చేయడంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే మాల్దీవుల విషయంలో భారత్ సానుకూలంగా స్పందిస్తోంది. మాల్దీవులు ఎప్పటికీ భారత్‌కు మిత్రదేశమేనని స్పష్టం చేసింది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు