కర్ణాటకలోని మహర్షి వాల్మీకి కార్పొరేషన్లో భారీ కుంభకోణం వెలుగు చూసింది. లబ్దిదారుల పేరుతో రూ.187కోట్లు దారిమళ్లించినట్లు అధికారులు గుర్తించారు. బెంగళూరులోని శివాజీనగర్, హైదరాబాద్లోని సత్యనారాయణవర్మ, శ్రీనివాసరావు ఇళ్లలో అవినీతి నిరోధకశాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వాల్మీకి కార్పొరేషన్ నుంచి తెలంగాణలోని 217 బ్యాంకు ఖాతాలకు రూ.187 కోట్లు మళ్లించినట్లు గుర్తించారు. నిందితుల ఇళ్ల నుంచి 16 కేజీల బంగారం. రూ.2.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల ఇళ్లలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. కర్ణాటక రాజకీయాల్లో వాల్మీకీ కార్పొరేషన్ కుంభకోణం పెను దుమారం రేపింది. నిందితులు తెలంగాణలోని బ్యాంకులకు నిధులు మళ్లించి, నగదు డ్రా చేయడంతో హైదరాబాదులోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.