కృష్ణా, గోదావరికి వరద పోటెత్తుతోంది. గోదావరి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. ధవళేశ్వరం వద్ద 15 అడుగులకు వరద చేరింది. 16 లక్షల క్యూసెక్కుల వరదనీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ఇక భద్రాచలం వద్ద గోదావరి వరద స్వల్పంగా తగ్గి 48 అడుగులకు దిగివచ్చింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో దాదాపు 110 లంక గ్రామాల ప్రజలు వరద గుప్పిట్లో చిక్కుచున్నారు. 15 వేల ఎకరాల్లో వరి నారు మడులు దెబ్బతిన్నాయి.
కృష్ణా నదికి వరద ఒక్కసారిగా పెరిగింది. మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసిన కుంభవృష్టి వర్షాలకు భారీ వరద చేరుతోంది. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 3 లక్షల 10 వేల క్యూసెక్కుల వరద చేరుతోంది. తుంగభద్ర నుంచి లక్షా 50 వేల క్యూసెక్కుల వరద శ్రీశైలం చేరుతోంది. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టుకు 4 లక్షల 60 వేల క్యూసెక్కుల వరద చేరుతోంది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టులో 178 టీఎంసీ వరద చేరడంతో గేట్లు ఎత్తేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం ఉదయం 9 గంటలకు గేట్లు ఎత్తే అవకాశముందని తెలుస్తోంది.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు