మహిళల ఆసియా కప్ -2024లో టైటిల్ విజేతగా శ్రీలంక జట్టు అవతరించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లనష్టానికి 165 పరుగులు చేసింది.ఆతిథ్య శ్రీలంక జట్టు 166 పరుగుల లక్ష్యాన్ని ఎనిమిది బంతులు మిగిలిఉండగానే ఛేదించింది. కేవలం రెండు వికెట్లు కోల్పోయి టైటిల్ విజేతగా శ్రీలంక నిలిచింది.
లంక కెప్టెన్ చమరి, హర్షిత సమరవిక్రమ హాఫ్ సెంచరీలో స్కోర్ బోర్డు ను పరిగెత్తించారు.దీప్తి శర్మ మాత్రమే ఒక వికెట్ తీసింది.అందరూ భారీగా పరుగులు సమర్పించారు.మరోవైపు ఫీల్డింగ్ తప్పిదాలు కూడా భారత్‌ను దెబ్బకొట్టాయి.
చమారీ అటపట్టు 43 బంతుల్లో 61 పరుగులు చేయగా ఆమె ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. హర్షిత సమరవిక్రమ 51 బంతుల్లో 69 పరుగులతో అజేయంగా నిలిచింది. కవిష దిల్హరి (30*) రాణించడంతో శ్రీలంకను విజయం వరించింది.
భారత అమ్మాయిలు క్రికెట్ జట్టు ఆసియా కప్‌లో శ్రీలంక చేతిలో ఓడిపోవడం ఇదే మొదటిసారి. భారత్ ఇప్పటివరకు ఏడుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది.