కృష్ణా, గోదావరి నదులకు వరద పొటెత్తుతోంది. భద్రాచలం వద్ద గోదావరి వరద 50 అడుగుల ప్రమాదకర స్థాయికి చేరింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 16 లక్షల క్యూసెక్కుల వరద సముద్రంలోకి విడుదల చేశారు. ధవళేశ్వరం బ్యారేజీ ద్వారా కాలువలకు 11 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. వరద పెరగడంతో రెండో నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. లంక గ్రామాలను వరద ముంచెత్తింది. వేలాది ఎకరాల్లో వరినారుమడులు దెబ్బతిన్నాయి.
కృష్ణాలోనూ అంతకంతకూ వరద పెరుగుతోంది. ఆల్మటి నుంచి జూరాలకు 3 లక్షల క్యూసెక్కుల వరద చేరుతోంది. జూరాల నుంచి 3 లక్షల 10 వేల క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి మరో లక్షా 50 వేల క్యూసెక్కుల వరద శ్రీశైలం చేరుతోంది. మొత్తంగా 4 లక్షల 69 వేల క్యూసెక్కుల వరద శ్రీశైలం చేరుతోంది. ఇప్పటికే శ్రీశైలంలో 150 టీఎంసీల నీరు చేరింది. 872 అడుగులకు వరద చేరింది. మంగళవారం ఉదయం గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌కు నీరు విడుదల చేయడానికి అధికారులు సిద్దం అవుతున్నారు.
ఢిల్లీ విమానాశ్రయ అధికారులపై జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆగ్రహం