అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం కేసు విచారణ వేగం పుంజుకుంది. ఇవాళ తాజాగా మదనపల్లె పోలీసులు వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాకు నోటీసులు జారీ చేశారు. మదనపల్లెలో ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు నవాజ్ బాషా అందుబాటులో లేకపోవడంతో, నోటీసులు జారీ చేస్తున్నట్లు ఫోన్ చేసి చెప్పారు.
నోటీసులు అందగానే విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది. ప్రస్తుతం నవాజ్ బాషా బెంగళూరులో ఉన్నట్లు సమాచారం. భూ రికార్డులను తారుమారు చేయడం ద్వారా వందల ఎకరాల భూములను 22 ఏ నుంచి తప్పించి కాజేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అనుచరులల్లో కొందరికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కీలక వైసీపీ నేతలు పరారీలో ఉన్నారు.