ఆగస్టులో నిర్వహించే విశేషఉత్సవాలపై టీటీడీ స్పష్టత
తిరుమలలో ఆగస్టు లో నిర్వహించే విశేష ఉత్సవాలపై టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. శ్రీ చక్రత్తాళ్వార్ వర్షతిరునక్షత్రం, శ్రీ ప్రతివాది భయంకర అణ్ణంగరాచార్య వర్ష తిరునక్షత్రం సందర్భంగా ఆగస్టు 4న ప్రత్యేక పూజలు జరగనున్నాయి. ఆగస్టు 7న ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొర, శ్రీవారు పురిశైవారి తోటకు వేంచేప కార్యక్రమాన్ని ఈ తేదీలోనే నిర్వహించనున్నారు.
గరుడ పంచమి, తిరుమల శ్రీవారి గరుడ సేవ ఆగస్టు 9న నిర్వహించనున్నారు. ఆగస్టు 10న కల్కి జయంతి, ఆగస్టు 13న తరిగొండ వెంగమాంబ వర్ధంతి నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
ఇక, ఆగస్టు 14న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఆగస్టు 15న భారత స్వాతంత్య్ర దినోత్సవం. స్మార్త ఏకాదశి జరపనున్నారు.
శ్రీవారి ఆలయం పవిత్రోత్సవాలు ఆగస్టు 15 నుంచి 17 వరకు జరగనున్నాయి. ఆగస్టు 16న వరలక్ష్మీ వ్రతంతో పాటు నారాయణగిరిలో ఛత్రస్థాపనోత్సవం జరగనుంది.ఆగస్టు 19నాడు శ్రావణపౌర్ణమి సందర్భంగా పౌర్ణమి గరుడ సేవ, రాఖీ పండుగ, హయగ్రీవ జయంతి, విఖనస మహాముని జయంతి నిర్వహిస్తారు.
ఆగస్టు 20నతిరుమల శ్రీవారు శ్రీ విఖనసాచార్య స్వామి సన్నిధికి వేంచేపుతో పాటు గాయత్రీ జపం చేస్తారు. ఆగస్టు 27న శ్రీకృష్ణాష్టమి, తిరుమల శ్రీవారి ఆస్థానం నిర్వహంచి , ఆగస్టు 28న శ్రీవారి శిక్యోత్సవం సందర్భగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరపనున్నట్లు టీటీడీ తెలిపింది.