భారీ వర్షాలకు చైనా ఆగ్నేయ ప్రాంతంలో జనజీవనం స్తంభించింది. వరదలకు మట్టిచరియలు విరిగిపడి 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది.
హునన్ ప్రావిన్సు హెంగ్‌యాంగ్ నగర పరిధిలో ని యూలిన్ గ్రామంలోని ఓ నివాసంపై మట్టిచరియ విరిగిపడ్డాయి. ఈ ఘటనలో శిథిలాల కింద 18 మంది చిక్కుకోగా ఆరుగురిని రక్షించారు. మరొకరి ఆచూకీ దొరకలేదు. భారీ వర్షాల కారణంగా పర్వతాల పైనుంచి వస్తున్న వరదతోనే మట్టిచరియలు విరిగిపడ్డాయన్నారు.
షాంఘై నగరంలో ఓ భారీ చెట్టు కూలడంతో ఓ డెలివరీ బాయ్ ప్రాణాలు కోల్పోయాడు. గేమి తుపాను కారణంగా గురువారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం తుపాను బలహీనపడినప్పటికీ చైనాలోని పలు ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. ఫిలిప్పీన్స్‌లో గేమి వల్ల 34 మంది చనిపోగా, తైవాన్‌లో పది మంది ప్రాణాలు కోల్పోయారు.