తెలంగాణ కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్‌వర్మ నియమితులయ్యారు. తెలంగాణ సహా 9 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదిముర్ము శనివారం రాత్రి ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుతం ఝార్ఖండ్ గవర్నర్‌గా వ్యవహరిస్తూ తెలంగాణకు ఇన్చార్జ్గా ఉన్న సీపీ రాధాకృష్ణన్‌ను మహారాష్ట్ర గవర్నర్‌గా నియమించారు.
జిష్ణుదేవ్ త్రిపుర బీజేపీ లో సీనియర్ నాయకుడుగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో చారిలమ్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. బిప్లబ్‌కుమార్‌దేబ్, మాణిక్‌సాహా ప్రభుత్వాల్లో మంత్రిగానూ సేవలందించిన అనుభవం ఉంది. 2023 ఎన్నికల్లో చారిలమ్ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడారు.
జిష్ణుదేవ్
1957 ఆగస్టు 15న త్రిపుర రాజకుటుంబంలో జన్మించారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగానూ సేవలందించారు. రామ జన్మభూమి ఉద్యమ సమయంలో బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్‌గా నియమితులుకాగా, ఆ రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత తెలంగాణ గవర్నర్‌గా నియమితులయ్యారు.
రాజస్థాన్ గవర్నర్‌గా మహారాష్ట్ర మాజీ స్పీకర్ హరిభావ్ కిషన్రావ్ బాగ్డేని నియమించిన రాష్ట్రపతి ఆ స్థానంలో ఉన్న సీనియర్ నేత కల్రాజ్ మిశ్రాను బాధ్యతల నుంచి తప్పించారు.
రాజస్థాన్ బీజేపీ నేత ఓం ప్రకాశ్ మాథుర్ సిక్కిం గవర్నర్‌గా వెళుతున్నారు. ఈ స్థానంలో ఉన్న లక్షణ్ ప్రసాద్ ఆచార్య అస్సాం గవర్నర్‌గా బదిలీ అయ్యారు.ఆయన మణిపుర్ గవర్నర్‌గానూ అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇప్పటివరకు మణిపుర్ గవర్నర్‌గా అనసూయ ఉయికే సేవలందించారు.
యూపీకి చెందిన కేంద్ర మాజీమంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్, ఝార్ఖండ్ గవర్నర్ గా నియమితులవ్వగా అస్సాం మాజీ ఎంపీ రమెన్ డేకాను ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. కర్ణాటక మాజీ మంత్రి సీహెచ్.విజయశంకర్ మేఘాలయ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు .
అస్సాం గవర్నర్ గులాబ్‌చంద్ కటారియాను పంజాబ్ గవర్నర్‌గా, కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్‌గా నియామకం అయ్యారు.
1979 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కె.కైలాసనాథన్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులయ్యారు.