ఢిల్లీలో ఘోరం జరిగింది. కోటి ఆశలతో సివిల్స్‌కు సిద్దం అవుతోన్న ముగ్గురు అభ్యర్థులు వరదలో మునిగి చనిపోయారు. ఈ ఘటన ఢిల్లీలోని ఓల్డ్ రాజేందర్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఫైర్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం..
ఓల్డ్ రాజేందర్ నగర్ నుంచి శనివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో రావూస్ అకాడమీ సెల్లార్ వరదనీటిలో ముగినిపోయినట్లు తమకు ఫోన్ వచ్చిందని ఫైర్ సిబ్బంది తెలిపారు. ఓ భవనం సెల్లార్లో అకాడమీ నిర్వహిస్తున్నారని గుర్తించారు. అతి భారీ వర్షానికి ఒక్కసారిగా వరదనీరు సెల్లార్‌ను ముంచెత్తిందని స్థానికులు తెలిపారు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకునేలోపే సెల్లార్ మొత్తం మునిగిపోయి ఉంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలించడంతో సెల్లార్లో ముగ్గురు సివిల్స్ అభ్యర్థుల శవాలు లభ్యమయ్యాయని ఫైర్ సిబ్బంది తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.