ఝార్ఖండ్‌లోని పాకుడ్ జిల్లాలో బంగ్లాదేశీ చొరబాటుదార్ల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. వారి అరాచకాలతో బెంబేలెత్తిపోయిన స్థానిక హిందువులు తమ ఇళ్ళను ఖాళీ చేసి ఆ ప్రాంతాలను వదిలిపెట్టి సామూహికంగా వలసలు పోతున్నారు. హిందూ అమ్మాయిల వేధింపులు నిత్యకృత్యమైపోయాయి. బంగ్లాదేశీ చొరబాటుదార్ల ‘లాండ్ జిహాద్’తో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఆ నేపథ్యంలో అక్రమ చొరబాటుదార్లకు వ్యతిరేకంగా విద్యార్ధులు నిన్న శుక్రవారం సాయంత్రం ఆందోళనలు చేపట్టారు. పొరుగుదేశపు తురకవారి చొరబాట్లను అడ్డుకోలేని ఝార్ఖండ్ పోలీసులు, స్వదేశీ విద్యార్ధులపై మాత్రం తమ లాఠీల ప్రతాపం గట్టిగా చూపించారు. రాత్రంతా వారిని కొడుతూనే ఉన్నారు.
మాజీ ముఖ్యమంత్రి, ఝార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబూలాల్ మరాండీ, పోలీసుల ఘాతుకాలను ఎక్స్ మాధ్యమం ద్వారా వెల్లడించారు. పాకుడ్ జిల్లా కలెక్టర్ వెంటనే పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, గాయపడిన విద్యార్ధులకు తగిన వైద్యచికిత్స అందించాలనీ డిమాండ్ చేసారు.
మరాండీ తన ట్వీట్లో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను నిలదీసారు. ‘‘బైటిదేశం నుంచి చొరబడిన వారిపై అంత ప్రేమ దేనికి చూపుతున్నారు? తమ తల్లులు, చెల్లెళ్ళను కాపాడుకోడానికి చొరబాట్లకు వ్యతిరేకంగా గళమెత్తిన యువకులైన విద్యార్ధులను ఎందుకు అణగదొక్కుతున్నారు? బంగ్లాదేశీ చొరబాటుదారులు ఝార్ఖండ్ ఉనికికి, మనుగడకూ ప్రమాదకరంగా మారారు. వారిని రక్షిస్తూ మీరు రాష్ట్రంలోని మూడున్నర కోట్ల ప్రజల భద్రతకు ముప్పు కలగజేస్తున్నారు’’ అని మండిపడ్డారు.
పెరుగుతున్న ఉద్రిక్తతలు, వర్గాల మధ్య ఘర్షణలు:
ఇటీవల పాకుడ్లో ఒక ముస్లిం యువకుడు ఒక హిందూ అమ్మాయిని వీడియో తీసి దాన్ని ఆన్లైన్లో వైరల్ చేసాడు. కోపోద్రిక్తులైన హిందువులు ఆ యువకుణ్ణి చితగ్గొట్టారు. దానికి ప్రతిగా ముస్లిములు హిందువుల ఇళ్ళను చుట్టుముట్టి వారిపై దాడులకు పాల్పడ్డారు. ప్రతిఘటించే క్రమంలో హిందువులు సైతం ప్రతిదాడులు చేసారు. రెండు వర్గాల వారూ రాళ్ళు రువ్వుకోవడంతో స్థానికంగా ఆస్తినష్టం వాటిల్లింది.
బంగ్లాదేశీ చొరబాటుదార్లకు భయపడి హిందువులు ఆ ప్రదేశాన్ని వదిలి వలసపోతున్నారు. గ్రామాలకు గ్రామాలే ఖాళీ అయిపోతున్నాయి. వాటిని ముస్లిములు ఆక్రమించుకుంటున్నారు. ‘ఝార్ఖండ్‌లో పరిస్థితి 90ల నాటి కశ్మీర్, ప్రస్తుతం బెంగాల్, కేరళ రాష్ట్రాల్లోని పరిస్థితి అంత ఘోరంగా మారుతోంది. ముస్లిం సంతుష్టీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం హిందువులపై జరుగుతున్న దాడుల విషయంలో నిర్లిప్తంగా ఉంటోంది’ అని బాబూలాల్ మరాండీ మండిపడ్డారు.
లాండ్ జిహాద్, గిరిజనులకు బెదిరింపులు:
పాకుడ్ జిల్లా మహేష్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గయాబదన్‌లో బంగ్లాదేశీ చొరబాటుదార్లు స్థానిక ఆదివాసీ, గిరిజన ప్రజలను వారి సొంత భూముల నుంచి తరిమేస్తున్నారు. చొరబాటుదార్లు స్థానిక ఆదివాసీలను బెదిరిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. బాబూలాల్ మరాండీ ఈ అంశం గురించి కూడా ఎక్స్‌లో ట్వీట్ చేసారు.
‘‘ఝార్ఖండ్ ఆదివాసీలను బంగ్లాదేశీ చొరబాటుదార్లు ఎలా బెదిరిస్తున్నారో చూడండి. ‘మీ జీవితాలను నాశనం చేస్తాం’ అని వారు హెచ్చరిస్తున్నారు. ఝార్ఖండ్ భవిష్యత్తును తలచుకుంటేనే భయం వేస్తోంది. పాకుడ్ జిల్లా మహేష్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గయాబదన్‌లో ల్యాండ్ జిహాద్ కేసు వెలుగు చూసింది. బంగ్లాదేశీ చొరబాటుదారులు స్థానికులైన భూయజమానులను చితకబాది, ఆ భూమిని లాగేసుకున్నారు’’ అని మరాండీ తన ట్వీట్లో వివరించారు.
‘‘జల్-జంగల్-జమీన్‌కు ఏకైక కాంట్రాక్టర్‌గా అవతరించిన హేమంత్ సోరెన్ ఇప్పుడు గిరిజనులు ఉనికిని తుడిచి పెట్టేసేందుకు కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఆయన ప్రభుత్వంలో, గిరిజనులు తమ భూమిని బంగ్లాదేశీ చొరబాటుదార్లకు అప్పగించి వెళ్ళిపోవాలి, లేకపోతే వారి జీవితాలకే ప్రమాదం. ఆదివాసీ వీరుల పురిటిగడ్డ మీద గిరిజన మహిళలు, కుమార్తెలపై జరుగుతున్న దురాగతాలు తీవ్రంగా బాధిస్తున్నాయి’’ అని ఆయన స్పష్టంగా వివరించారు.
కఠిన చర్యల కోసం డిమాండ్:
బాబూలాల్ మరాండీ సామాజిక మాధ్యమాల్లో వెల్లడిస్తున్న వివరాలతో ఝార్ఖండ్‌లోని వాస్తవ స్థితిగతులు బాహ్య ప్రపంచానికి తెలుస్తున్నాయి. చొరబాట్లు, పోలీసు అరాచకాలపైనా, అక్రమ చొరబాట్లపైనా హేమంత్ సోరెన్ ప్రభుత్వం తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను మరాండీ కోరారు. పాకుడ్ జిల్లా వ్యవహారం అక్రమ వలసలు, మతఘర్షణలు, ప్రభుత్వ నిస్తబ్ధత, సాధారణ ప్రజల భద్రతకు ప్రమాదం వంటి అంశాలను ఆయన ప్రస్తావించి, కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.