జమ్ముకశ్మీర్‌లోని కుప్వారాలో భారత్, పాకిస్తాన్ సైన్యాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఉత్తర కశ్మీర్‌లోని నియంత్రణ రేఖపై మచల్ సెక్టార్లో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్ కాల్పులు జరిపింది. దీనిని భారత ఆర్మీ సమర్థంగా తిప్పికొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు భారత జవాన్లు గాయపడగా వారిలో ఒకరు చికిత్స పొందుతూ వీరమరణం పొందారు. ఓ ఉగ్రవాది కూడా ప్రాణాలు కోల్పోయాడు.
పాకిస్తాన్ ఆర్మీకి చెందిన కమాండోలతో పాటు, బాట్ టీమ్ స్క్వాడ్లలో అల్-బదర్, తెహ్రికుల్ ముజాహిదీన్, లష్కర్, జైష్ సంస్థలకు చెందని ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించగా భారత ఆర్మీ అడ్డుకుంది.
ప్రస్తుతం మచల్‌లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. తెల్లవారుజామున మచల్ సెక్టార్‌లోని కుంకడి ఫార్వర్డ్ పోస్ట్‌లో ఉన్న సైనికులు, అటుగా బ్యాట్ స్క్వాడ్ వెళ్లడాన్ని పసిగట్టారు. లొంగిపోవాలని సూచించిన్పటికీ పట్టించుకోకుండా కాల్పులు జరిపారు. దీంతో భారత సైనికులు ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చింది. దాదాపు మూడు గంటల పాటు ఇరువైపులా కాల్పులు జరిగాయి.