నీతి ఆయోగ్ సమావేశం మరి కాసేపట్లో ఢిల్లీలో ప్రారంభం కానుంది. ఇప్పటియే ఎన్డీయే పక్షాల ముఖ్యమంత్రులతోపాటు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ చేరుకున్నారు. పలు కీలక అంశాలపై నీతి ఆయోగ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించనుంది. ఈ సమావేశాలకు ప్రతిసారీ దూరంగా ఉంటూ వస్తోన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరు కానుండటం విశేషం. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం సాయంత్రమే ఢిల్లీ చేరుకున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నీతి ఆయోగ్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కావడం లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు నీతి ఆయోగ్ సమావేశాలకు దూరంగా ఉన్నారు.