ఫ్రాన్స్ రాజధాని పారిస్లో 2024 ఒలింపిక్స్ కన్నులపండువగా ప్రారంభమయ్యాయి. 6800 మంది క్రీడాకారులు 85 పడవల్లో సెన్ నది మీదుగా ఈఫెల్ టవర్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఒలింపిక్ జ్యోతిని ఒక హాట్ ఎయిర్ బెలూన్ ద్వారా ఆకాశంలోకి పంపించారు.
ఒలింపిక్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ‘సిటీ ఆఫ్ లైట్స్’గా పేరున్న పారిస్ నగరం మొత్తం ఒక పెద్ద స్పోర్ట్స్ స్టేడియంగా మారిపోయింది. సెన్ నది పరిసర ప్రాంతాలన్నీ క్రీడాభిమానులతో నిండిపోయాయి. ప్రముఖ కళాదర్శకుడు థామస్ జాలీ నేతృత్వంలో నాలుగు గంటల పాటు గొప్పగా ప్రారంభోత్సవం జరిగింది.
వర్షం పడుతున్నప్పటికీ క్రీడాకారులు పడవల డెక్ల మీదనే ప్రయాణించారు. ప్రేక్షకులు నది పొడుగునా, దారిలో ఉన్న వంతెలన మీద కిక్కిరిసిపోయారు. బాలే డాన్సర్లు పెద్దపెద్ద వేదికల మీద అద్భుతంగా ప్రదర్శనలిచ్చారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రాన్ ‘పారిస్ ఒలింపిక్ క్రీడలు ప్రారంభమైనట్లు ప్రకటిస్తున్నాను’ అని చెప్పడంతో ఈ ప్రపంచక్రీడోత్సవం అధికారికంగా మొదలైంది. ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాక్ ఫ్రెంచ్ అధ్యక్షుడితో పాటు ఈ వేడుకలను ప్రారంభించారు.
ఆస్తులన్నీ కాజేసిన అన్నగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు : షర్మిల