రెండు సంవత్సరాలుగా రష్యాతో సాగుతోన్న యుద్ధంల దెబ్బతిన్న ఉక్రెయిన్‌లో ప్రధాని మోదీ ఆగష్టు 23వ తేదీ పర్యటించబోతున్నారంటూ జాతీయ మీడియా ప్రచురించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని మోదీ పలు అంశాలపై చర్చలు జరపనున్నారు. ఇటీవల ప్రధాని మోదీ రష్యాలో పర్యటించారు. ఆ దేశ అధ్యక్షుడు పుతినతో పలు అంశాలపై చర్చలు జరిపారు.
ఉక్రెయిన్, రష్యా యుద్ధం ఆపాలని ప్రధాని మోదీ పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చల్లో ఉక్రెయిన్‌తో జరుగుతోన్న యుద్ధం గురించి చర్చించినట్లు ఎక్కడా కథనాలు రాలేదు. అయితే ఇరుదేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు ప్రధాని మోదీ ప్రయత్నాలు చేసే అవకాశాలు లేకపోలేదని జతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఉక్రెయిన్‌లో ప్రధాని మోదీ పర్యటనపై విదేశాంగ శాఖ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.