అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ పేరు ఖరారైంది. ఈ విషయం కమలా హారిస్ స్వయంగా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష బరి నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవడంతో కమలా హారిస్‌కు మార్గం సుగమం అయింది.
అమెరికాలో ప్రతి ఒక్కరి మద్దతు పొందేందుకు ప్రయత్నం చేస్తానని కమలా హారిస్ ప్రకటించారు. రిపబ్లికన్ పార్టీ నుంచి మాజీ అధ్యక్షుడు ట్రంప్ బరిలో నిలిచారు. వీరిద్దరి మధ్యే పోటీ జరగనుంది. కమలా హారిస్ గెలిస్తే అమెరికాలో ఓ మహిళ మొదటిసారి అధ్యక్ష పీఠం దక్కించుకున్నట్లు అవుతుంది.