బడ్జెట్ వ్యూహం నుంచి స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. బడ్జెట్ తరవాత భారీగా తగ్గిన కంపెనీల షేర్లు కొనుగోలు చేసేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపారు. ముఖ్యంగా భారీగా తగ్గిన టెక్ స్టాక్స్ కొనుగోలు చేశారు.ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ, భారతీఎయిల్‌టెల్ భారీగా పెరగడంతో సెన్సెక్స్, నిఫ్టీల్లో భారీ పెరుగుదల నమోదైంది.
సెన్సెక్స్ 1292 పాయింట్లు పెరిగి 81332 వద్ద ముగిసింది. నిఫ్టీ 428 పెరిగి, 24834 పాయింట్ల వద్ద ముగిసింది. రూపాయి స్వల్పంగా బలహీనపడింది. అమెరికా డాలరుకు రూపాయి విలువ 83.64 వద్ద ట్రేడవుతోంది. ముడిచమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
అమెరికాలో రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలు మించడంతో టెక్ స్టాక్స్ కొనుగోళ్లకు మద్దతు లభించింది. ఐటీ కంపెనీలకు ప్రాజెక్ట్ పనులు ఎక్కువ భాగం అమెరికా నుంచి వస్తుండటంతో, ఆ రంగం షేర్లకు ఊతం లభించింది. ప్రధానంగా ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐసిఐసిఐ,భారతీ ఎయిర్‌టెల్ షేర్లు రాణించాయి.